Wednesday 8 February 2017

Jai Kshatriya...Jai Jai Kshatriya Corporation...

క్షత్రియలందరికి నమస్కారం
మీ అందరికీ క్షత్రియ జాతి గొప్పతనం గురించో మన వాళ్ళు ఏమి చేసారో చెప్పటానికో పోస్ట్ చేయటం లేదు, మనందరం ఏమి చేయాలని అనే విషయం మీద ఈ విజ్ఞప్తి.
 మనలో ఎంతమంది అర్ధికంగా ఉన్నతస్థాయిలో వున్న  అంతకన్నా చాలా మంది అర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు, వారిని  మనవారు సహృదయంతో కోంత మందికి అండ నిలబడుతున్నారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.
ఇంకా చాలా మంది ఆత్మగౌరవం అడ్డు వచ్చి చేయిచాచి అడగలేని వారు ఎంతో మంది, అలాగని వారిని వదలేద్దమ్మ, ఏ క్షత్రియడుడైన దానం చేయటానికి ఇష్టపడతారు కాని దానం పోందటానికి ఇష్టపడరని నా అభిప్రాయం, వారందరికీ న్యాయం జరగాలంటే దానంగా కాకుండా హక్కుగా పోందాలి
మనం చేస్తే దానం అదే ప్రభుత్వం నుండి పోందితే హక్కుగా భావిస్తారు, మనలో వున్నది దానగుణం మనలో లేనిది ఐక్యత (చరిత్ర చెప్పిన సత్యం) మన జనాభానే తక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే కాని ఇప్పుడు మన జాతి కోసం ఐక్యంగా పోరాడి క్షత్రియ కార్పోరేషన్ సాధించుకుందాం.
ఈ గ్రూప్ లో వున్న ప్రతి క్షత్రియడుకి నా విఙప్తి
క్షత్రియ కార్పోరేషన్ మాటలు చెప్పినంత సులువుగా రాదు అని నాకు తెలుసు, మనందరం కలిసి పోరాడితేనే వస్తుంది,  క్షత్రియ కార్పోరేషన్ సాధనకి కావాల్సిందీ ప్రచారం, అవగాహన, నమ్మకం.
ఇది నా వ్యకిగత అభిప్రాయమే అయిన మనలో చాలా మందికి ఈ అభిప్రాయం వుందని నా నమ్మకం, వారందరికీ స్వాగతం ఇదే వేదిక నుండి మనవారందరిని కలుపుకుని క్షత్రియ కార్పోరేషన్ సాధన దిశగా అడుగులు వేద్దాం.
జై అల్లూరి
జైజై  క్షత్రియ
(దయచేసి మీ అభిప్రాయాలను తేలియజేయగలరు)
Thanks to Siva Addepalli

Tuesday 7 February 2017

India Against Cow Slathering...

భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 48 దేశంలోని గోవులను, పశుసంపదను వధించకూడదని, వాటిని కాపాడుకోవాలని సూచిస్తుంది.

* The A.P. Prohibition of Cow slaughter and Animal Preservation Act 1977 ప్రకారం ఆం.ప్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో గోహత్యానిషేధ చట్టం అమలులో ఉన్నది.

* ఈ చట్టం లోని section 5 ప్రకారం ఉభయ రాష్ట్రాలలో ఆవులను, లేగదూడలను వధించకూడదు. ( ఆవు మరియు బఱ్ఱె దూడలు అవి మగవైనా, ఆడవైనా లేగదూడలు అని అంటారు. వాటిని వధించుట నిషేధం ).

* Section 6 ప్రకారం ఎద్దులు, దున్నలు, గేదెలను వధించాలంటే వాటి వయసు 14 సంవత్సరాలు దాటి ఉండాలి, శక్తి క్షీణించి వ్యవసాయ పనులు చేయలేకపోతున్నవి - బరువులను లాగలేకపోతున్నవి అని ప్రభుత్వం నియామకం చేసిన వెటర్నరీ అధికారి సర్టిఫికెట్ ఉండాలి.

*అలాంటి వాటిని కూడా ప్రభుత్వ అనుమతి ఉన్న కబేళాలలో మాత్రమే వధించాలి.

* ఒక ట్రక్కులో (DCM) లో 6 కంటే ఎక్కువ పశువులను తరలించకూడదు.

*The Prevention of Cruelty to Animals act 1960 ప్రకారం దేశంలో జంతువులను హింసించడం నేరం.

ఈ చట్టం అన్ని జంతువులకు వర్తిస్తుంది. ప్రస్తుతం మన రాష్ట్రాలలో భారీ ఎత్తున పై చట్టాల ఉల్లంఘన జరుగుతుంది.

ఎవరూ సమాచారం ఇవ్వకపోతే గోమాతలను కూడా చూసీ చూడనట్లుగా కబేళాలకు వదిలేస్తున్నారు.

ఈ పరిస్థితి మారాలి, లేకపోతే పశుసంపద అంతరించిపోతుంది.

శ్రీకాంత్ గూడా సౌజన్యంతో