Monday, 6 April 2026

Did Rama consume meat / non-ved?

ఎవరు ఎన్ని అనుకున్నా కూడా వాల్మీకి రామాయణంలో మనం ఒక ఘట్టాన్ని మర్చిపోకూడదు . కైకకు రాములవారు ఇచ్చిన ప్రామిస్ కైక అడిగిన వరాలు సింపుల్ ఆ ఘట్టం ఒకటి చదివితే రాముడు తిన్నాడా లేదా అనేది అందరికి తెలిసిపోతుంది .... ఒకవేళ రాములవారు మాంసం తిన్నాడు అని అంటే మాట తప్పడు మాట తప్పడు మడిమతిప్పడు అనే రాముల వారి యొక్క ఉపమానానికి కళంకం తెచ్చిన వాళ్ళం అవుతాం... మీరు చెబుతున్నారు తిన్నాడు అని ఆ ఫోటోలు ప్రింట్ తీసి చూపించండి ఏముందో తెలుస్తుంది మీకు ఆ శ్లోకాలు అర్థాలు చేసుకోండి

1) శ్రీ రాఘవుడు  తన తండ్రి అయిన దశరథునితో చెప్పిన మాటలు....

ఫలాని మూలాని చ భక్షయన్ వనే 

గిరీంశ్చ పశ్యన్ సరితః సరాంసి చ 

వనం ప్రవిశ్యెవ విచిత్రపాదపం 

సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః

చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లెడి వనములయందు ప్రవేశించి, ఫలమూలములను భుజించుచు, అచటి పర్వతములను, నదీ ప్రవాహములను, సరోవరతీరములను గాంచుచు అచట హాయిగా ఉందును. కనుక నీవును ఇచట మనస్తాపమునువీడి శాంతచిత్తుడవై ఉండుము.”


2) శ్రీరామచంద్రుడు గుహునితో చెప్పిన మాటలు 

భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితమ్ । 

శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే | 

కుశచీరాజినధరం ఫలమూలాశినం చ మామ్ । విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరమ్ । 

అనంతరము ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములగు అన్నపానీయములను తెప్పించెను, ఆ స్వామికి అర్ఘ్యపాద్యాది సత్కారములను నెఱపెను, పిదప ఆయనతో ఇట్లనెను. (37)

37

“ఓ మహాబాహూ! మీకు స్వాగతము, ఈ రాజ్యమంతయును మీదే. మీరు మాకు ప్రభువులు, మేము పరిచారకులము. కావున సాదరముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు. భక్ష్యములు (అన్నము మొదలగుని) భోజ్యములు, (పాయసాదులు) పానకములు మొదలగునవియును, లేహ్యములును ఇచట సిద్ధముగానున్నవి. అందఱును ఆరగింపుడు. చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి. గుఱ్ఱములకు గడ్డి మొదలగు ఆహారపదార్థములు సిద్ధమొనర్ప బడినవి.” (38-39)

“ఓ మిత్రమా! వీటిని నేను ప్రతిగ్రహింపజాలను. ఏలనన ప్రస్తుతము నేను పితృవాక్యపరిపాలన ధర్మమునకు బద్ధుడనై వనములయందు తాపసిగానున్నాను. కనుక నారచీరలు, మృగచర్మమును ధరించియుంటిని. ఫలమూలాదులే నాకు ఆహారములు, దీనిని గమనింపుము. (41-44)


అయోధ్యకాండ ఏకాదశి సర్గ 27వ శ్లోకం 


దశరథునితో కైక అడిగిన వరాలు

అయోధ్యకాండ 34వ సర్గ 59 వ శ్లోకం 


నవ పంచ చ వర్షాణి దండకారణ్యమాశ్రితః । చీరాజినజటాధారీ రామో భవతు తాపసః। 22


రామలక్ష్మణులకు ఆకలి దప్పులు లేకుండా విశ్వామిత్రుల వారు బలా అతిబల అనే విద్యలను అనుగ్రహించారు ..... మరి అటువంటప్పుడు మన పేరు మోసిన ప్రవచరకారులు చాగంటి గరికపాటి మొదలైన వారు రామలక్ష్మణులు ఆకలితో ఉన్నప్పుడు అడవిలోకి వెళ్లి జింకలు దుప్పులు అడవి పందులను చంపి తీసుకుని వచ్చి (పచనం )అంటే కాల్చి తిన్నారు అని ఎలా చెప్తారు ... తమకు తాము స్వయం ప్రకటిత మేధావులుగా ప్రజలకు ప్రజలకు తెలియ చెప్పుకోవటానికి కొన్ని సంస్కృత పదాలు అలా పారవేస్తే అబ్బో ఎంత గొప్పగా చెప్పారు పండితుల వారు అని అనుకోవాలని ...... నోటికి వచ్చినదల్లా వాగుతూ ఉంటారు ...


శ్రీరాముడంటే పడని వారు ఇలాంటి అపవ్యాఖ్యానాలు చేస్తూనే వుంటారు .... మాంసం తిన్నాడనీ ఒకరు మద్యం తాగారు అని ఒకరు.... హత్యా పాతకం చుట్టుకున్న పాపాత్ముడు అని ఒకరు మాకు తెలిసిన శ్రీ రాముడు షోడశకళానిధి;గుణనిధి; దేవాదిదేవుడు....సకల శాస్త్రాలు ప్రామాణిక గ్రంధాలు తెలిపింది కూడా అదే !!! 


మాంసం అనే పదానికి అర్థం ఏమిటి ???

మన్యతే బలకరతి ఇతి మాంసం ..... కండ పట్టి వున్న దుంపలకు కూడా మాంసము అని పేరు ఆయుర్వేదములో కూడా కొన్ని దుంపలకు మొక్కలకు కూడా మాంసము అనే పేర్లు వున్నాయి ..... ఇక్కడ శ్రీ రాముడు మాంసం తిన్నాడు అని రామాయణం లో వుంటే కంద మూలాలు తిన్నాడని అర్థం ..... అంతే కానీ దారిన పోయే జంతువును పట్టుకొని తోలు తీసుకొని తిన్నాడు అని కాదు ఆ లెక్కన దుంపలకు కూడా తోలు అనేది వుంటుంది అరటి పండు కూడా తొక్క తీయకుండా తినలేము తోలు అనే పదం వుంది మాంసం అనే పదం వుంది అని అపవ్యాఖ్యాణాలు చేయకూడదు ..... పోనియండి ఈ పండితులు పాండిత్యం ఎంత వున్నా వ్యాస భగవానుడి కంటే గొప్పవారా??? భీష్మ పితామహుల కంటే గొప్పవారా???


వ్యాస భగవానుడు రచించిన మహాభారతం లో అనుశాసనిక పర్వము లో 116వ అధ్యాయం లో భీష్మ పితామహుడు ధర్మరాజుకి మాంసం భక్షించనీ రాజుల గురించి చెప్తున్నారు శ్లోకం సంఖ్య మీకు శ్లోకం పక్కన ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి .....


63:- యే వర్జయన్తి మాంసాని మాసశః పక్షశొ ఽపి వా

తేషాం హింసా నివృత్తానాం బరహ్మలొకొ విధీయతే

64 :- మాంసం తు కౌముథం పక్షం వర్జితం పార్ద రాజభిః

సర్వభూతాత్మభూతైర తైర విజ్ఞాతార్దపరావరైః

65 :- నాభాగేనామ్బరీషేణ గయేన చ మహాత్మనా

ఆయుషా చానరణ్యేన థిలీప రఘుపూరుభిః

66 :- కార్తవీర్యానిరుథ్ధాభ్యాం నహుషేణ యయాతినా

నృగేణ విష్వగశ్వేన తదైవ శశబిన్థునా

యువనాశ్వేన చ తదా శిబినౌశీనరేణ చ

67:- శయేనచిత్రేణ రాజేన్థ్ర సొమకేన వృకేణ చ

రైవతేన రన్తి థేవేన వసునా సృఞ్జయేన చ

68:- థుఃషన్తేన కరూషేణ #రామాలర్క నలైస తదా

విరూపాశ్వేన నిమినా జనకేన చ ధీమతా

69 :- సిలేన పృదునా చైవ వీరసేనేన చైవ హ

#ఇక్ష్వాకుణాశమ్భునా చ శవేతేన సగరేణ చ

70 :- ఏతైశ చాన్యైశ చ రాజేన్థ్ర పురా మాంసం న భక్షితమ

శారథం కౌముథం మాసం తతస తే సవర్గమ ఆప్నువన


ముప్పయి మంది రాజులు మాంసం తినలేదు అని చెప్తూ అందులో శ్రీరాముని ప్రస్తావన కూడా తెచ్చారు భీష్మాచార్యులు .....

భూమ్యాకాశాలు తల్లకిందులు అయినా అబద్దం చెప్పని భీష్మ పితామహుడు..... 

ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన ధర్మరాజుకి బోధించిన పాఠం ! గ్రంధస్తం చేసింది అష్టాదశ పురాణములను లోకానికి అందజేసిన మహనీయుడు... ఇది పరమ ప్రామాణికం .... ఈ వ్యాఖాతలు పండితులు అందరూ కూడా వాల్మీకి మహర్షి వ్యాస భగవానుడి తర్వాతే అన్న సత్యాన్ని గ్రహించండి 🙏


రాముడు మాంసం తినడు ఇది సత్యము అదే హనుమంతుడు శ్రీరాముని గురించి సీతమ్మకు తెలిపాడు .... భీష్ముడు తన మనవడైన ధర్మరాజుకి బోధించాడు 


ప్రమాణాలను నమ్మండి ప్రవచన/ పరవచన కారులను కాదు !!!


Reference by Sri Agraharam Raghava.


#LordRama #BhagawanRama #SriRamaChandraPrabhu #NonVeg #Vegetarian #SitaMatha #

Sunday, 20 July 2025

History of Kshatriya's Kingdom

 రాజు (తెలుగు క్షత్రియ) రాజ్యం:


 • చార్ మహల్: కలిదిండి (కౌండిన్యస గోత్రం)

 • గోలుకొండ: భూపతిరాజు వంశం (ధనంజయ గోత్రం)

 • కార్వేటినగర్ (తిరుపతి సమీపంలోని చిత్తూరు జిల్లా)

 • కోట ఉరట్ల -తంగేడు (తూర్పు గోదావరి): సాగి / ఛాగి (వశిష్ట గోత్రం)

 • మొగల్తూరు (పశ్చిమ గోదావరి): కలిదిండి (కౌండిన్యస గోత్రం) వంశం

 • ఒంగోలు: మందపాటి (కశ్యప గోత్ర)

 • పద్మనాభం: సాగి / ఛాగి వంశం (వశిష్ట గోత్రం)

 • పెద్దాపురం: వత్సవాయి / వత్సవయ (వశిష్ట గోత్రం)

 • రాజమండ్రి: పూసపాటి (వశిష్ట గోత్రం)

 • రామచంద్రపురం (కోట రామచంద్ర పురం): కాకర్లపుడి (వశిష్ట గోత్రం)

 • తణుకు (పశ్చిమ గోదావరి): ఉప్పలపాటి (కశ్యప గోత్రం)

 • తుని, తూర్పు గోదావరి: దంతులూరి (ధనంజయ గోత్రం)

 • విజయనగరం: పూసపాటి (వశిష్ట గోత్రం)

 • తెట్టు (నెల్లూరు జిల్లా): వేజండ్ల / వేజర్ల (వశిష్ట గోత్రం)

 • తోయ్యేరు, కొప్పురం: నల్లపరాజు (ధనంజయ గోత్రం)


*నిజాం/వలసరాజ్యాల కాలం:*

 సుల్తాన్లు, నిజాంలు మరియు బ్రిటీష్ వారందరూ పన్నులు వసూలు చేసే బాధ్యతతో రాజులను ఎస్టేట్ల గవర్నర్లుగా నియమించారు. 1857 లో బ్రిటీష్ వారు ఎస్టేట్‌లను విచ్ఛిన్నం చేసి, పెద్ద బ్రిగేడ్ లను ప్రిన్సీలు, రాష్ట్రాలుగా మరియు తక్కువ వాటిని జమీందార్లు లేదా జాగీర్దార్లుగా మార్చారు. 1947లో ఇండియన్ యూనియన్ ఏర్పడిన తరువాత ఈ జమీందార్లను రద్దు చేశారు.


 *రాజుల జమీందార్లు:*

 జమీందార్లు మరియు కుండలీకరణాల్లో వాటిని నియంత్రించిన కుటుంబాలు.


 *ఆంధ్ర:*

 అనెగుండి (నారాపతి)

 అనకాపల్లి (పూసపాటి)

 గోల్కొండ (భూపతిరాజు)

 చెముడు (వైరిచర్ల)

 చార్ మహల్ (కలిదిండి)

 చింతలపల్లి (అల్లూరి)

 దార్లపూడి (చింతలపాటి)

 దిమిలి (పూసపాటి)

 విజయవాడ (బెజవాడ మాధవ వర్మ)

 ఏలూరు (తిరుపతిరాజు)

 గంధవరం (పాకలపాటి)

 గోడి (రుద్రరాజు)

 గోడిచర్ల (వత్సవాయి)

 గోడిలంక (రుద్రరాజు)

 కార్వేటినగరం

 కాసిపురం (పూసపాటి)

 కుమిలి (పూసపాటి)

 కుప్పిలి (జంపన)

 కొత్తకోట (పిన్నమరాజు)

 కోట ఉరట్ల (రాజా సాగి)

 కొండకిర్లా (సాగి)

 కురుపం (వైరిచర్ల)

 కొరుకొండ (తిరుపతిరాజు)

 కొత్తూరు (సాగి)

 కొప్పురం (నల్లపరాజు)

 మాడ్గోల్-మాడుగుల (చింతలపాటి) మత్స్య దేశం నుండి వచ్చిన వారు

 మేరంగి (శత్రుచర్ల)

 మొగల్తూరు (కలిదిండి)

 మొయిడా (పెనుమత్స)

 నక్కపిల్లి (కాకర్లపుడి)

 పెద్దాపురం (వత్సవాయి)

 పుత్తూరు (మాదిరాజు)

 రాజమండ్రి (పూసపాటి)

 రామచంద్రపురం (కోట రాజ కుటుంబం) ఎస్‌ఆర్‌కె రాజా గోపాల్ నరస రాజు.

 రాయవరం (సాగి)

 రాజాలా (సాగి)

 రాజపాళయం (వలివర్తి)

 రాజోలు (కనుమూరి)

 రేవిడి (భూపతిరాజ)

 పద్మనాభం (రాజా సాగి)

 శ్రీరాంపురం (కాకర్లపుడి)

 సాలూరు (శత్రుచర్ల)

 తంగేడు (రాజా సాగి)

 తుని (వత్సవాయి)

 ఉప్పాడ (పూసపాటి)

 వేమలపూడి (సాగి)

 వెల్చూర్ కోడూరు (సాగి)

 విజయనగరం (పూసపాటి)

 పెదమజ్జిపాలెం (శిరువూరి)

 వురుట్ల (దంతులూరి)

 జయపూర్ (1768 లో విజయరామరాజు జయపూర్‌ను జాగీర్ గా మంజూరు చేశారు)

 ముప్పాళ్ల

    

*ఐదు గోత్రాలకు చెందిన తెలుగు క్షత్రియులు:*

       

        1. పశుపతి

        2. కశ్యప

        3. వశిష్ట

        4. ధనుంజయ(ఆత్రేయస)

        5. కౌండిన్యస


పశుపతి కశ్యప మహర్షి కౌండిన్య (కుండిన్) యొక్క శాఖ, వశిష్ఠ కుమారుడు మరియు అగస్త్య మేనల్లుడు.


 ధనుజయ విశ్వమిత్ర శాఖ. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఇంటిపేర్లు కుటుంబం యొక్క మూలం గ్రామం నుండి వచ్చాయి కాబట్టి కొన్ని ఇంటిపేర్లు ఇతర తెలుగు వర్గాలలో కనిపిస్తాయి. కొన్ని క్షత్రియ పేర్లు వాస్తవానికి ఒకేలా ఉన్నాయి కాని ప్రాంతీయ ఉచ్చారణ తేడాల కారణంగా అవి భిన్నంగా ఉచ్ఛారణ చేయబడతాయి.

Wednesday, 14 May 2025

DNR College


 🙏"డి.ఎన్.ఆర్" కాలేజీల వ్యవస్థాపకులు "శ్రీ దంతులూరి నారాయణ రాజు గారి" జయంతి సందర్భంగా...


(జననం: 06.05.1898.

మరణం: 07.05.1964.)


🙏"శ్రీ దంతులూరి నారాయణ రాజు గారు"...(డి.ఎన్.ఆర్.) 

అంటే తెలియని వాళ్ళు ఎవరు

ఉండరు... స్వాతంత్ర్యo రాక మునుపే అంటే 1945 లోనే

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం

లో డి.ఎన్.ఆర్ కాలేజీని స్థాపించారు...

(దంతులూరి నారాయణ 

రాజు గారు)


🙏"నారాయణరాజు గారిది" పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా కాళ్ళ మండలం కోపల్లే గ్రామం... రాజు గారు స్వాతంత్ర్య సమరయోధుడు కూడా...


🙏1945 లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ అంచెలంచెలుగా మహావృక్షంగా ఎదిగింది.

దేశంలో తెలుగు వాళ్ళు మంచి స్థాయిలో ఎవరైనా ఉంటే వాళ్లకు డి.ఎన్.ఆర్ కాలేజీ తో అనుబందం ఉన్నట్లే... ఈ కాలేజీ లో 

ఎంతో మంది చదువుకున్నారు... వాళ్ళు అంతా మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు... ఎంతో మందికి విద్యాదానం చేసిన దాత "డి.ఎన్.ఆర్.గారు"...


*కొసమెరుపు ఏమిటంటే...

ఈయనకు అల్లూరి అంటే చాలా అభిమానం...

అల్లూరి కాలం చేసిన రోజే 

ఈయన కూడా కాలం చేయడం.

(సంవత్సరం వేరు) మరొక 

విషయం ఏమిటంటే...

ఈ రోజు నారాయణరాజు గారిది జయంతి (127వ జయంతి) కాకతాళీయంగా జయంతి, వర్ధంతి తేదీలు వరసగా రావడం...

(రేపు 61వ వర్ధంతి)


జయంతి: 

ఘనంగా చేసుకోవాలి.

వాళ్ళు మళ్ళీ మళ్ళీ 

జన్మించాలని...

🙏నారాయణరాజు గారికి ప్రణామాలు అర్పిస్తూ...✍️🙏 

Monday, 27 January 2025

Vijayanagara Kingdom

 Royal inheritance of the #Kingdom #Vijayanagara 


విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి...

కాని శ్రీకృష్ణ దేవరాయలు చిన్న తమ్ముడు పెనుగొండ రాజధానిగా చేసుకుని మిగిలిన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు... ఆయన చనిపోయిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు అల్లుడు అళియ రామరాయలు తమ్ముడు కొడుకు వెంకటపతి రాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనం అధిష్టించి పోగోట్టుకున్న హంపిని తప్ప బహమనీ సుల్తానులు పీచమణిచి ప్రతికారము తీర్చుకోవడం మాత్రమే కాదు తళ్ళికోట యుద్ధంలో పోగోట్టుకున్న రాజ్యం భాగాలను గెలుచుకొని అరవీటి వంశస్థులు మరో 125 సంవత్సరాల పాటు పరిపాలన చేసారు... విజయనగర సామ్రాజ్య అచేతనావస్థలో అంటే విజయనగర సామ్రాజ్యం బలహీనపడే సమయంలో ఉత్తుంగ తరంగం వలే అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరాఠా సామ్రాజ్యం బలంగా మారుతున్న సమయంలో విజయనగర సామ్రాజ్య చివరి చక్రవర్తి అరవీటి వంశస్థులు హైందవ సామ్రాజ్య రక్షణా భాద్యతలను ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అప్పగించారు...




Monday, 17 June 2024

డాక్టర్ v s n రాజుగారు

 డాక్టర్ v s n రాజుగారు (MBBS)..


ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పనిచేసి రిటైరయ్యారు. పదవీ విరమణ పొందిన తరువాత తణుకు నరేంద్ర సెంటర్ లో ఫ్రీ కన్సల్టేషన్ వైద్య సేవలు అందిస్తున్నారు. పదవి విరమణ పొందినది విధులకే గాని సేవలకు కాదు అని నిరూపించారు. తణుకు మరియు పరిసర ప్రాంతాల్లో క్షత్రియులు వీరి నాణ్యమైన సేవలను పొందగలరని ఆశిస్తున్నాను..



#DrVSNrajuflightlieutenant

Wednesday, 25 January 2023

PadmaSri Sri. CV Raju

Central govt announced padmasree award our Kshatriya person C V Raju congratulations 💐💐💐💐👏👏👌👏👏

దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన పిల్లలు ఆడుకునే మొదటి బొమ్మలు ఏటికొప్పాక గ్రామంలో చెక్కబడ్డాయి. అవి దేశీయ అంకుడు మొక్క నుండి సేకరించిన కలపతో తయారు చేయబడ్డాయి మరియు సహజ రంగులు మరియు చెట్ల సాప్‌తో పెయింట్ మరియు లక్కతో తయారు చేయబడ్డాయి. బొమ్మలు ఎటువంటి పదునైన అంచులు లేకుండా రూపొందించబడ్డాయి, ఇది పిల్లలకు సురక్షితంగా చేసింది. అయితే, 1980ల నాటికి, ఈ ప్రత్యేకమైన బొమ్మల అభివృద్ధి చెందుతున్న వ్యాపారం సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంకుడు చెట్టు దాదాపు అంతరించిపోయే స్థితికి చేరుకుంది, అయితే అటవీ నిర్మూలన వల్ల హస్తకళాకారులు రంగులు మరియు లక్క తయారీకి సహజ వనరులను నొక్కడం కష్టతరం చేసింది. టాక్సిన్-లేస్డ్ పెయింట్‌లు మరియు రంగులతో చేసిన కృత్రిమ రంగులు క్రాఫ్ట్‌లోకి ప్రవేశించాయి.


 అప్పుడే ఏటికొప్పాకకు చెందిన వ్యవసాయాధికారి సీవీ రాజు విశిష్టమైన బొమ్మల పరిశ్రమను పునరుజ్జీవింపజేయడం సవాలుగా తీసుకున్నారు. శ్రమతో కూడిన శ్రమ మరియు పరిశోధనల ద్వారా, అతను రంగులను సృష్టించడానికి, బొమ్మలను వాటి సేంద్రీయ స్వభావానికి తిరిగి తీసుకురావడానికి మూలంగా లభించే మొక్కలు, మూలాలు మరియు అటవీ కలుపు మొక్కలను తిరిగి గుర్తించాడు. "నేను కూడా ప్రయోగాలు ప్రారంభించాను మరియు ఇక్కడ ఒక చిన్న ప్రయోగశాలను స్థాపించాను, ఫాబ్రిక్, ఫైబర్‌పై ప్రయోగాలు చేస్తున్నాను" అని ఆయన చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, రాజు, ఇతర స్థానిక బొమ్మల తయారీదారులు, వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ మరియు వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయ ప్రయత్నాలకు ధన్యవాదాలు, ఏటికొప్పాక బొమ్మలు భారతదేశంలో మరియు విదేశాలలో తిరిగి మార్కెట్‌లోకి వచ్చాయి.


 ఏటికొప్పాక బొమ్మలను అంతరించిపోకుండా కాపాడేందుకు రాజు చేసిన కృషిని 2020లో ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' సిరీస్‌లో ప్రశంసించారు. రాజు ప్రకారం, భారత మార్కెట్‌లను ముంచెత్తిన చైనీస్ బొమ్మలు దేశీయ బొమ్మలకు తీవ్రమైన ముప్పు తెచ్చాయి. పరిశ్రమ, ఏటికొప్పాకలో చేసిన బొమ్మలతో సహా. "చైనీస్ బొమ్మలు ఇప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి," అని ఆయన చెప్పారు.




#Padmasree #CVRaju #Etikoppaka #Organic #Cultural