Thursday 3 November 2022

About AlluriSitaramaRaju on the Eve of Azadikaamritmahotsav

 *అల్లూరి సీతారామ రాజు జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలు:*

1) 04.07.1897 - పాండ్రంగి లో రాజు జననం. 

2) 1908 - కలరా సోకి తండ్రి మరణం. 

3) 1911 - అన్నవరంలో ఉపనయనం - రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ, రామచంద్రాపురం, నర్సాపురం, తుని పట్టణాల్లో విద్యాభ్యాసం. 

4) 1916 - తీర్థయాత్రలు. 

5) 1917 - మన్యంలోని కృష్ణదేవి పేట చేరిక. 

6) 1918 - ధారకొండ వద్ద తపస్సు. 

7) 1919 - మళ్లీ తీర్థ యాత్రలు. 

8) 1921 - నాసికా త్రయంబకం యాత్ర - మన్యం ప్రజల్లో ప్రబోధం - విప్లవ సన్నాహాలు. 

9) 30.01.1922 - పితూరి వదంతిపై విచారణ - రాజు వాఙ్మూలం - నర్సీపట్నంలో నిర్బంధం - పైడిపుట్ట వద్ద వ్యవసాయం. 

10) జూన్ 1922 - కుటుంబాన్ని నర్సాపురం పంపివేయుట. 

11) 22.08.1922 - చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి. 

12) 23.08.1922 - కృష్ణదేవి పేట స్టేషన్ పై దాడి. 

13) 24.08.1922 - రాజవొమ్మంగి స్టేషన్ పై దాడి. 

14) 03.09.1922 - ఒంజేరి ఘాట్ వద్ద విజయం. 

15) 24.09.1922 - దామనపల్లి ఘాట్ వద్ద విజయం(ఇద్దరు ఆంగ్లేయుల మృతి).

16) 16.10.1922 - అడ్డతీగెల స్టేషన్ పై దాడి. 

17) 19.10.1922 - రంపచోడ వరం స్టేషన్ పై దాడి. 

18) 06.12.1922 - పెద్దగడ్డ పాలెం వద్ద పోరాటం. 

19. 07.12.1922 - లింగాపురం వద్ద పోరాటం. 

20) 17.04.1923 - అల్లూరి అన్నవరం ఆగమనం. 

21) 19.09.1922 - మల్లుదొర అరెస్టు - ద్వీపాంతర వాస శిక్ష. 

22) 26.10.1923 - గూడెం పోలీసు గుడారాలపై దాడి. 

23) 27.01.1924 - అస్సాం రైఫిల్ దళాల రాక. 

24) 17.04.1924 - రూథర్ ఫర్డ్ నియామకం - గ్రామస్తులపై దురాగతాలు. 

25) 06.05.1924 - అగ్గిరాజు పట్టివేత - అండమాన్స్ లో నిర్బంధం. 

26) 07.05.1924 - ‘మంప’ సమీపాన సీతారామ రాజు పట్టుబడుట - మేజర్ గుడాల్ కాల్పులకు రాజు బలి. 

27) 08.05.1924 - కె.డి. పేట సమీపాన రాజు శవ దహనం. 

28) 26.05.1924 - గ్రామస్తుల చేతిలో ఎండు పడాల్ హతం. 

29) 07.06.1924 - గంటం దొర వీర మరణం. 

30) 10.06.1924 - గ్రామస్తులచే గోకిరి ఎర్రేసు పట్టివేత - మన్య విప్లవ పరిసమాప్తి. - Dr MR SubbaRaju garu