పైడిపుట్టకు వెళతాను. అక్కడ పంచాంగం చూసి ముహూర్తం చూసుకుని అడ్డతీగల కానీ రంపచోడవరం గాని వెళతాను. ఇదే రిపోర్టు మీ అధికారులకు ఇవ్వు అని శ్రీరామరాజు ఓక SI కి చెబుతాడు..
గోదావరి జాల్లా కలెక్టర్ ఆందోళనగా ఉన్నాడు...
రామరాజు కధలికలను నిరోధించే సాహసం మనము చేయలేకపోతున్నాము అని కంగారుగా అన్నాడు..
ఇంటిలిజెన్స్ SI ఎం చెప్పాడు అని కలెక్టర్ కింద అధికారిని అడిగాడు..
చెప్పాడు అడ్డతీగలకే వెళతానని చెప్పాడు ..! అన్నాడు పంతులు.
ఎవరు చెప్పారు..? కలెక్టర్ అడిగాడు.
రామరాజే చెప్పాడు ఇంటెలిజెన్స్ SI కి అని వాఖ్యం పూర్తి చేసాడు పంతులు..
ఏమిటి ? ఆ ఇంటెలిజెన్స్ వాడు స్వయంగా రామరాజు నే అడిగి వచ్చాడా..?వాడసలు ఇంటెలిజెన్స్ వాడేనా ? చాటింపు వేసేవాడా ?
ఏ పోలీసు స్టేషన్ కొడతారు రాజుగారు అని !స్వయంగా తిరుగుబాటు దారుడిని ఎవరైనా అడుగుతారా?
తలకాయ ఉందా SI కి..?! మండి పడ్డాడు కలెక్టర్..
పంచాంగం చూసుకుని తీరిగ్గా వచ్చి పోలీసు స్టేషన్ ని కొడతానంటూ తిరుగుబాటుదారుడు సవాల్ చేయడం . అదికూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకు స్వయంగా చెప్పడమా ..అతని ధైర్యం మనకు అవమానకరం అని రగిలిపోతున్నాడు..రామరాజు వైఖరికి ఆశ్చర్యపోతూ..
అక్టోబర్ మాసం కాభట్టి త్వరగా చీకట్లు కమ్ముకుంటున్నాయి చలితో పోటీపడుతూ..
కలెక్టర్ సార్.. మిమ్మల్ని ఓక గ్రామ అధికారి ఓకరు కలవాలనుకుంటున్నాడు !. కంగారుపడుతూ చెప్పాడు కాంప్ క్లర్క్ . మతి పోతుందా.. గ్రామ అధికారి నన్ను కలవడం ఎంటి? విషయం కనుక్కుని పంపేయ్.. చికాగు ఉన్న కలెక్టర్ అరిచాడు.
సార్.. అతనిద్వారా సీతారామరాజు పంపించాడంట..
రామరాజు దగ్గర నుంచి నాకు కబురా..?
ఎం జరుగుతుంది అసలు..?
సరే తీసుకురా..?
అంటూ అరిచాడు కలెక్టర్..
గ్రామ అధికారి వంగి దండం పెట్టి చిన్న చీటి వినయంగా కలెక్టర్ చేతిలో పెట్టాడు.మడత విప్పి చూసాడు కలెక్టర్.
చదివాక కలెక్టర్ చేతులు వణకడం మొదలుపెట్టాయి..ఆ చీటిలో..ఇలా ఉంది...
కలెక్టర్ బ్రేకన్ కు..!!
" నేను అడ్డతీగలకు రెండు మైళ్ళు దూరంలో ఉన్నాను. పోలీసు స్టేషన్ ను కొడతాను. మీరు తలపడడానికైనా రావచ్చు. మాట్లాడడానికైనా రావచ్చు"
.........అల్లూరి సీతారామరాజు
రాత్రి పదిగంటలు..
అడ్డతీగల పొలిమేరలో తుపాకులు పేలాయి.. ప్రత్యర్ధులకు తన వస్ధున్న విషయం చెప్పకనే చెప్పి .తనతో తలపడడానికైనా తగినంత సమయంముందే ఇచ్చి అడ్డతీగలలో అడుగుపెట్టాడు.అది ప్రకటిస్తూ మళ్ళీ తుపాకులు మోగాయి..
రామరాజు కి వ్యతిరేకంగా విధులు నిర్వహించడం అటుంచి ఎదోలా ప్రాణాలు దక్కించుకోవాలని పోలీసులు పారిపోయారు ఉన్నపలంగా..
పోలీసు స్టేషన్ కి ముందు కొచ్చి నుంచుంది కొండదళం.
మళ్ళీ తుపాకులు పేల్చారు.
వెతకవలసిన అవసరం లేదు.. అన్నాడు రామరాజు. ఆయన అంతరంగాన్ని అంతం చేసుకున్న అనుచరులు .
మూటలూ విప్పి స్టేషన్ అరుగు మీద భోజనం చేసి గొంగళ్ళు కప్పుకుని అక్కడే నిద్రపోయారు.రామరాజు నలుగురు అనుచరులు స్టేషన్ లో ఆశీనులయ్యారు విశ్రాంతిగా..
అప్పుడు ఓక వ్యక్తి వచ్చి వినమ్రంగా రామరాజు ముందు నిలబడ్డాడు..
ఎవరు అని ? అనుచరులు అడిగారు.
నాపేరు నాకిరెడ్డి రుద్రయ్య..మునసుబుని కలెక్టర్ పంపించారు అన్నాడతను..
ఏమిటి పని? అన్నాడు మల్లు..
ఇక్కడ రాజుగారు ఉన్నారో లేరో చూసి రమ్మన్నాడు కలెక్టర్ దొర అన్నాడు మునసుబు.
ఉత్తరంలో రాసినట్టు రామరాజు వచ్చారు.
కొండదళం వచ్చింది .
పోలీసు స్టేషన్ పై దాడి జరిగింది.
అందరూ పారిపోయారు.
స్టేషన్ లో ఏమీ మిగలలేదు..
మీరాకకోసం (కలెక్టర్ ) రామరాజు స్టేషన్ లో వేచిచూస్తున్నారని చెప్పు.. అన్నాడు రామరాజు.
చూడండి మునసూబు గారు.. రేపు అంటే అక్టోబర్ 16-1922 న మధ్యాహ్నం వరుకూ పైడిమెట్టలో ఉంటామని తెలియచేయండి మీ కలెక్టర్ కు..మునసూబు బయలుదేరాడు రాత్రి పదకొండున్నరకు..
రెండు గంటళవేళ..తలుపు చప్పుడు విని బయపడ్డాడు కలెక్టర్.. మునసూబు అని తెలుసుకుని తలుపు తీసాడు.
రామరాజు వచ్చాడా..దర్పంగా అడిగాడు కలెక్టర్..
మునసూబు చెబుతూ ఆ స్వామి అక్కడే ఉన్నారు దొర..
ఎమన్నాడు ? కొంచెం దర్పం తగ్గించుకుని అడిగాడు..
స్టేషన్ లో అందరూ పారిపోయారు.
కలెక్టర్ వస్తే మాట్లాడతా..
ఆయన కోసమే ఎదురు చూస్తున్నా..
రేపు పైడిపుట్టలో మధ్యాహ్నం దాకా ఉంటాను
అక్కడికొచ్చినా సరే అన్నారండి .
అని మునసుబు చెప్పాడు...
అని చెప్పారండి రాజుగొరు..
కలెక్టర్ మునసుబుని పంపి కుర్చీలో కూలబడిపోయాడు..
అడ్డతీగల స్టేషన్ చరిత్రలో మూడు సార్లు తగలబడింది. ఈసారి రామరాజు అగ్గిపుళ్ళ గీయకుండా నన్ను నాతో కలిపి యంత్రాంగాన్ని అదే స్టేషన్ లో ధగ్ధం చేసాడు అని రోదిస్తూ.. రామరాజు ధైర్యాన్ని దాని వెనుక దేశభక్తిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు మనసులో..
క్షత్రియాస్ గ్రూపు సభ్యులు అడ్మిన్స్ తరుపున ..నివాళి అర్పిస్తూ మనసులో మాట..
అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ఆయన వీరగాధలో వీరోచిత ఘట్టం ఇది. ఇటువంటి వి ఆయన పోరాట పధాలు జీవితంలో చాలా ఉన్నాయి..ఉత్తరభారతాన ఈ ఆకుపచ్చ సూరీడు పుట్టి ఉంటే మరో మరో భగత్ సింగ్ లా గుర్తింపు దేశమంతటా వచ్చుండేది..
జోహర్ అల్లూరి..🙏 జోహర్ తెలుగువీర..🙏

No comments:
Post a Comment