Thursday 14 July 2022

Kalinga Kingdom and VijayaNagara Dunasty

కళింగ విజయనగర సంస్థానము

(పూసపాటివారు):


చివరి భాగము...

శ్రీ విజయరామ్ సింగ్ (1883-1922). శ్రీ 3వ విజయరామగజ ప్రతి భార్య అంకరాజేశ్వరిగారి మేనల్లుడు, దత్తుడు. దత్తతనామము పూసపొటి 4వ విజయరామగజపతి,

దత్తుడుగా వచ్చిన ఈయన 1904వ సంవత్సరముప విజయనగరము సంస్థానమునకు ప్రభుయ్యెను. ఈయన అయోధ్య తాలూక్ దారులలో నొకరగు శ్రీ ఠాకూర్ సురాజ్ భాక్షు గారి తనూజ లలితకుమారిని వివాహవయ్యెను. ఈయన 1919 సం॥న విజయనగరములో సంగీత కళాశాల స్థాపించెను. ఈయన కోరుకొండ భవన నిర్మాణకర్త సంస్కృత కళాశాల భవననిర్మాత. 4వ విజయరామగజపతి మహారాజావారు విజయనగర రాజకుటుంబ సంప్రదాయమును చక్కగా పోషించినారు. వీరికి రాజ్యలక్ష్మి లభించినది కాని ఆరోగ్యభాగ్యము క్రమముగ దూరమైనది. వీరు దుర్భరమైన ఘనవ్యాధికి గురియైనారు. వీరికి సంపూర్ణ దృష్టి మాంద్యము సంభవించినది. 1919 సంవత్సరములో వీరి ఆరోగ్యము మిక్కిలి క్షిణదశకు వచ్చినది. 13-9-1922 తేదీని వీరు మరణించిరి.



శ్రీ పూనపాటి అలకనారాయణ గజపతి మహారాజు (26-8-1902 నుంచి 26.10.1937) 4వ విజయరామగజపతి జ్యేష్ఠపుత్రుడు. ద్వితీయ పుత్రుడు విజయానంద గజపతి.

వీరిరువురి పాలనల గురించి గతనెలలో పెట్టిన క్షత్రియరత్నాలు #3, #4 మరియు పి.వి.జి.రాజుగారి గురించి క్షత్రియరత్నాలు #5 శీర్షికలలో చూడవచ్చును.



విజయరామరాజు అను నామమునకును విద్యావికాసమునకును మైత్రియున్నట్లు గన్పట్టుచున్నది. మొదటి విజయరామగజపతి విజయనగర దుర్గమందు పట్టాభిషిక్తుడయ్యెను. విజయనగరమున 3వ విజయరామగజపతి కాలమున అంకురించిన విద్యాబీజమును 5వ విజయరామ గజపతి కాలమున దళము విప్పినది. అలనాడు బలమునకు ఆలవాలమైన విజయనగర దుర్గము ఈనాడు పాండిత్యమునకు నిలయమై యలరారుచున్నది. 3వ ఆనందగజపతి మహారాజు (అభినవ ఆంధ్రభోజుడు) విజయనగరములో విశ్వవిద్యాలయము స్థాపించుటకు ఉద్యుక్తులై దాసన్నపేట కొండల సమీపమున మైలు పొడవు, 1000 గజములు వెడల్పుగల స్థలము దానికొఱకు ఏర్పఱచిరి. కావలసినయెడల మఱికొంతస్థలము దానికి కలిపెమనిరి. కాని వారి అకాల మరణమువలన ఆపథకము అమలునకు రాలేదు. శ్రీ పి.వి.జి రాజుగారు విజయనగరమున విశ్వవిద్యాలయ నిర్మాణమునకు కృషిచేసి తమ ప్రపితామహుడు తలపెట్టిన కార్యమును తాము సఫలీకృతము గావించెరేమో!


పూసపాటి వారి కోటలు :

 1. కుమిలి కోట : 

పూసపాటివారు కళింగాంధ్రదేశమున నిర్మించిన దుర్గములలో నిదియే మొదటిది. దీనిని పూసపాటి పెదజగన్నాధరాజుగారి కుమారుడు కృష్ణమరాజు 16వ శతాబ్దిలో కుమిలిలో మట్టికోట కట్టించిరి. ప్రహరి గోడ చుట్టునూ కందకము ఇప్పటికిని కలదు. ప్రహరీగోడలు సుమారు 220 గజముల పొడవు, 180 గజముల వెడల్పుగల దీర్ఘచతురస్త్రాకారమున నుండి కూలబడి ఎత్తైన దిబ్బలవలె నున్నవి. రాజభవనముయొక్క చిహ్నములేవియు కానరావు. 9 అడుగుల భుజముగల చతురస్త్రాకారపునుయ్యి కట్టు చెక్కుచెదరక యున్నది. దీనికి అడుగుభాగముకూడ గచ్చేనట. నూతిలో నీరు 5 నిలువుల లోతున్నది. నాలుగుమూలలనూ శిధిలమైన బురుజుల చిహ్నములున్నవి. ఆవరణలో 1న్నర గజముల పొడవు, ఒక గజము వెడల్పు, అరగజము ఎత్తుగల అరుగు శిధిలావస్థలోనున్నది. ఆవరణ వైశాల్యము 8ఎకరములు. విజయనగరం మహరాజావారు ఇందులో సగభాగము కుమిలి వాస్తవ్యులు శ్రీ దంతులూరి సన్యాసిరాజు గారికిని, సగభాగము కాపులకునూ సేద్యమునకు విడచిరి. దీనిలో మెట్టవ్యవసాయ మున్నది. కోటకు పశ్చిమమున పెద్ద చెరువు కలదు.

2. పొట్నూరు కోట : 

పూసపాటివారికి పూర్వము ఈదుర్గము బాహుబలేంద్రునకు రాచపట్టుగా నుండెడిది. కుమిలికోట కట్టించిన కృష్ణమరాజు రెండవకుమారుడు అన్నమరాజు. వీరిజ్యేష్ఠపుతుడు కృష్ణమరాజు  17వ శతాబ్దమున పొట్నూరు కోటను వశపఱచుకొని పునరుద్ధరించిరి.  ప్రస్తుతము గ్రామమునకు దక్షిణమున కోటదిబ్బలు కలవు. ఇటికలు 12 అంగుళములు పొడవు, 9 అంగుళములు వెడల్పు కలిగి చాల గట్టిగనున్నవి. కోటదిబ్బల తూర్పుభాగమును కిలారి రామమూర్తి నాయుడు చిన్న మేడ కట్టించుకున్నాడు. హంపీ విజయనగరసామ్రాజ్యాధీశ్వరుడు శ్రీకృష్ణదేవరాయలు 1515 సంవత్సరమున నెల్లూరు మండలములోని ఉదయగిరి, కొండవీడు, కృష్ణామండలమునందలి కొండపల్లి, రాజమహేంద్రవరము మున్నగు దుర్గములను జయించి స్వాధీనముచేసికొనెను. కళింగ సామ్రాజ్యాధిపతి ప్రతాపరుద్రుని కుమారుని కొండవీడులో బంధించి కారాగృహమందుంచెను. తన విజయ పరంపరలను, తాను, తన దేవేరులు దేవునికి సమర్పించిన 991 మంచి ముత్యములుగల మౌక్తికహారము మున్నగు బహుమతుల వివరములను సింహాచలక్షేత్రమున వేంచేసియున్న శ్రీ వరాహనరసింహస్వామివారి ఆలయమున శిలాశాసనములు వేయించెను. ఈ శాసనములు ఇప్పటికిని నిలచియున్నవి. పిమ్మట కళింగ సార్వభౌమునిపై ఘనవిజయము సాధించెను. జామి, కోఠాం, వడ్డాది, పొట్నూరులను పతనముగావించి పొట్నూరులో తాటిచెట్టు ప్రమాణమున జయస్తంభము వేయించెను. తాను కళింగరాజ్యమున సాధించిన విజయముల వృత్తాంతము జయస్తంభముపై శిలాశాసనము వేయించెను. ప్రస్తుతము జయస్తంభము కాదుగదా దాని శిధిలావశేషములైనను పొట్నూరులో కానరావు. అల్లసాని పెద్దన కృతమగు "మనుచరిత్ర" ప్రథమాశ్వాసమున 36, 38 పద్యములలోను, శ్రీకృష్ణదేవరాయలు రచించిన "ఆముక్త మాల్యద" చతుర్థా శ్వాసమున 290 పద్యములోనూ ఈ చరిత్ర వర్ణింపబడినది.


3. విజయనగరము కోట : 

పొట్నూరు కృష్ణమరాజుగారి తృతీయ పుత్రుడను, సీతారామచంద్రుని దత్తుడునైన పూసపాటి మొదటి ఆనందగజపతి కీ॥శ. 1713 సంవత్సరమున విజయనగర దుర్గమును నిర్మిం ఓది మిక్కిలి బలమైన దర్దము. ప్రహరి గోడలు సుమారు 30 అడుగుల యెత్తుగ డాయితో కట్టబడినవి. కోట దీర్ఘచతురస్రా కారమున నుండును. ప్రహరిగోడల పొడవు ఉత్తర దక్షిణములకు సుమారు 200 గజములును, తూర్పు పడమరలకు దీనికంటె కొంచె మధికముగ నుండెను. ప్రహరిచుట్టును కందకము (అగడిత) కలదు. సింహద్వారము తూర్పునను, పిల్ల దేవిడి పడమరను కలవు. నాలుగు మూలలను నాలుగు బురుజులు కలవు. ఈశాన్యమూల నున్న బురుజు జెండా బురుజు. జెండాపై చిహ్నము జుల్ ఫికార్. కోటలో ఆంజనేయస్వామి కోవెల, నౌబత్ ఖానా, కార్యాలయములు, మోతీమహల్, అంతఃపురము, ఈశతాబ్దమున రాణివాసమునకై నిర్మింపబడిన రౌండ్ మహల్, ఇటీవల 'మాన్సాస్' వారు నిర్మించిన ఆధునిక భవనములు మున్నగునవి కలవు. విద్యాదుర్గముగ పరిణామముజెంది విరాజిల్లుచున్న విజయనగర దుర్గము చూపులకు కనులపండువగా నుండును. 


4. దేవుపల్లికోట; 

ఉషాభ్యుదయకర్త వేంకటపతిరాజుగారి పుత్రుడు సీతారామ సార్వ భౌముడు దేవుపల్లిలో కోట కట్టించి దానిలో ప్రవేశించెను. ప్రహరిగోడలు 20 అడుగుల యెత్తుగ బలమును కట్టబడిన జాతిగోడలు. పడమటి గోడ నేలమట్టమైనది. తక్కినవి మూడును చెక్కుచెదరలేదు. గోడలమధ్యగల స్థలముయొక్క వైశాల్యము 6 ఎకరములుండును. దీనిలో ప్రస్తుతము మెట్ట వ్యవసాయమున్నది. ఆగ్నేయమూలను నుయ్యికలదు. దేవుపల్లికోటకు పడమరదిశను 1న్నర మైళ్ళ దూరమున తూర్పు కనుమల పర్వతశ్రేణికలదు. నెలివాడ గొట్టుముక్కల రామచంద్ర భూపతిగారి యాదేశమున వారి దివాన్ తమిరి చిన్నయ్య త్రవ్వించిన 'మెంటాడ - నెలివాడ కాలువ' (M. N. Channel.) దేవుపల్లి గ్రామముప్రక్కను ప్రవహించును. సీతారామసార్వభౌమునికి రాజధానియై దేవుపల్లి ఆకాలమున వందలాది ఆంధ్ర క్షత్రియ కుటుంబములకు వాసస్థలమై సకలసంపదలతో కలకలలాడుచు చారిత్రిక ప్రసిద్ధిగాంచినది. మొదటి విజయరామగజపతి పట్టమహిషి చంద్రయ్యమ్మ గారు దేవుపల్లి కోటలోనే హత్య గావింపబడినారు. 


పూసపాటి కవులు:

 పూసపాటి రాచిరాజు క్రీ. శ. 1484 నం.న వసిష్ఠగోత్రక్షత్రియ గృహనామ సీసమాలికను రచించెను. పూసపాటి తమ్మిరాజు (తమ్మభూపాలుడు 1620-1670) శ్రీకృష్ణవిజయ మను అయిదశ్వాసముల శృంగార ప్రబంధమును రచించెను. పూసపాటి వెంకటపతిరాజు ఉషాభ్యుదయమను అయిదశ్వాసముల ప్రౌఢప్రబంధమును రచించెను. ఇది పిల్ల వసుచరిత్రయను ప్రసిద్ధి గాంచినది. మొదటి ఆనందరాజు నవరామాయణమను రమ్యకావ్యమును రచించెను. కాని అగ్రంథమింత వఱకు లభ్యము కాలేదు. 3వ ఆనందగజపతి (అభినవ ఆంధ్ర భోజుడు) సంస్కృతాంధ్రములలో పెక్క చాటువులు రచించెను. పరదరాజకృతమగు లఘుకౌముదిని కొంతభాగము వీరే ఆంధ్రీకరించిరి. విజయనగరం ట్రీటీ (Vizianagaram Treaty of November 15th, 1758) వీరి ఆంగ్ల రచనము. పూసపాటి చినజగన్నాధరాజు పౌత్రుడు కొండరాజు (కొండ్రాజు) వేంకటాచల మహాత్మ్యము రచించెను. ఇది లభ్యముకాలేదు. కొండ్రాజు ద్వితీయ పుత్రుడగు కృష్ణమరాజు రేగులవలస పూసపాటివారికి మూలపురుషుడు. వీరి చతుర్ధపుత్రుడు భూపాలరాజు. ఈ భూపాలరాజు రెండవ కుమారుడగు విజయరామరాజు “విష్ణుభక్తి సుధాకర పారశరీయహోర” గ్రంథకర్త. బొబ్బిలి యుద్ధవీరుడు విజయరామగజపతి మహారాజు ఈ గ్రంథమును రచించెనని దువ్వూరి జగన్నాథశర్మగారు వ్రాసిరి. కాని ఈ వ్రాత సత్యవిరుద్ధము


ఒక పొరపాటు:- సీతారామసార్వభౌముని పుత్రుడును, చెందుర్తి యుద్ధవీరుడునైన 2వ ఆనందగజపతి పెదవిజయరామ గజపతి భార్య చంద్రయ్యమ్మగారి మొదటిదత్తుడని వ్రాయబడినది. ఇది పొరపాటు. 2వ ఆనందగజపతి చంద్రయ్యమ్మగారి దత్తుడుకాడు. విజయనగర రాజ్యమునకు వారసుడు. తాళ్ళపాలెం పూసపాటి రామభద్రరాజుగారి ద్వితీయపుత్రుడు వేంకటపతిరాజు గారొక్కరే చంద్రయ్యమ్మగారి దత్తుడు. వీరే చినవిజయరామగజపతి, పద్మనాభ యుద్ధవీరుడు. కోట భోగాపురమున ప్రవేశించిన పూసపాటి రఘునాధరాజునకు తమ్మిరాజను నామాంతరము లేవనియును, రఘునాధరాజు తమ్మునిపేరు తమ్మిరాజనియును నొకవాదము కలదు.

కళింగ విజయనగర సంస్థాన చరిత్ర సమాప్తము..








No comments:

Post a Comment