Sunday 18 December 2016

బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్య ,శూద్రులు..అంటూ మనలో 4 శాఖలు.
శూద్రులలో కొన్ని అగ్ర కులాలతో పాటు మరి కొన్ని నిమ్న కులాలు.
వారిలో #_రిజర్వేషన్లు పొందే వారిలో #_ఎస్సీ_ఎస్టీలు మరియు #_బిసి_లు వున్నారు.వారికి మన ప్రభుత్వం #_రిజర్వేషన్లు కలిపించి 70 సంవత్సరాలు అయ్యింది.రిజర్వేషన్ సౌలభ్యం లేని అగ్ర కులాల పేదలు అనేక మంది వున్నారు. వారిని పట్టించుకునే నాధుడు లేడు. అంతెందుకు .. ఇంకా గ్రామాల్లో ఉన్న #_ఎస్సీ_ఎస్టీలు మరియు #_బిసి_లే డెవలప్ కావడం లేదు ఎందుకు... ???
దీనికి కారణాలు...
1) ధనవంతులైన #ఎస్సి_ఎస్టీ మరియు #_బిసి లు మళ్ళి మళ్ళి #_రిజర్వేషన్ల ను అనుభవిచడం... వారు మరియు వారి వారసులే రాజకీయాలు చెయడం...
2) ఒక సారి కుటుంబం లొ ఎవరికైన ప్రభుత్వ ఉద్యొగం ఉంటె... లెేక డాక్టర్ , కలెక్టర్ , ఇంజనీర్ ఐతె వారి పిల్లలకు చదువులొ కాని , జాబ్ లొ కాని #_రిజర్వేషన్లు కల్పించ కూడదు... ఒక వెల వారికి జాబ్ రాకపోతే,మూడవ తారనికి Reservation కల్పించాలి... ఈ #_రొటేషన్ పద్దతి ద్వార కొంత మంది పేద వాల్లకైనా న్యాయం జరుగుతుంది ...
3) ప్రజలలొ చదువు మీద చైతన్యం కల్పించ కుండా ఇంకా కుల రాజకీయలను ప్రొత్సహించడం.
4) మెదట ధనవంతులయిన #SC , #ST మరియు #BC లకు #RESERVATION తొలగించి పేద #SC, #ST మరియు #BC లకు కలిపించడం. రాజకీయంలొ కూడ పేద వాల్లకే స్థానం కలిపించాలి ...
5) ప్రతి నెలా చదువు కొసం పేద #SC, #ST మరియు #BC లకు #GOVERMENT తరుపున కొంత అర్ధిక సహయం అందించాలి ...
6) నేను చెప్పెది నిజమైన పేద #SC, #ST, #BC #EBC (ఇతర కుల పేదలకు) లకు #Resevation ఇవ్వమనే... కలెక్టర్ అయినవాడి కొడుకు కూడ మల్లీ Reservation తొ డాక్టర్ అవుతున్నాడు. దీని వల్ల నిజమైన పేద SC,ST,BC లకు Reservation ఫలాలు అందడం లేదు.దనవంతుడికి సీటు ఇవ్వడం వల్ల పేద వాడికి సీటు రనట్టె కదా ,మరి పేద వాడు ఎలా Develop అవుతాడు.నెను reservation తీసెయ్యమనడం లేదు... Rotation పద్దతి అవలంబించాలి అంటున్నాను... అప్పుడైనా కనిసం నిజమైన పేద వాడు లబ్దిపొందుతాడు...
7) మీరు ఇప్పుడు #DEVELOP కాక పొతె ఇక ఎప్పటికీ డవలప్ కాలేరు,ఎందుకంటే భూముల ధరలు పెరిగాయి, ROOM_RENT లు పెరిగాయి . చదువు వ్యాపారం అయ్యింది . అలొచించండి...
మిత్రులారా...
ఇది పేద లైన SC , ST మరియు BC లకు న్యాయం జరిగే వరకూ షేర్ చెయండి...
పైన చెప్పిన వన్ని చేస్తె నిజమయిన పేద SC, ST మరియు BC లు ధనవంతులు అవుతారు. నేను చెప్పింది తప్పొలేక నిజమా ఆలొచించండి ...
ఈ విధానాన్ని అమలు చేస్తే కొన్ని సంవత్సరాల్లోనే వెనుకబడిన వారికి పూర్తిగా న్యాయం జరుగుతుంది.... ఆ తర్వాత పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేసినా ఎవరు బాధ పడరు. ఎందుకంటే రిజర్వేషన్ సౌలభ్యం లేని అగ్ర కులాల పేదలు అనేక మంది వున్నారు.ఆ తర్వాత కుల రహిత సమాజం నిర్మాణం అవుతుంది.అన్ని కులాలు సమానం అవుతాయి.
మన హిందూ ధర్మం నుండి మత మార్పిడులు ఉండవు...
తద్వారా భారత దేశం అభివృద్ధి చెందుతుంది...
#DeviVarma

Saturday 17 December 2016

ఈ చిత్రపటం చూస్తూ ఉంటే ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నట్లుగా ఉంది. బల్బు ని ఉరికంబానికి లాక్కెలుతుంటే కొవ్వొత్తులు చూస్తూ ఊరికే నిల్చొని ఉన్నాయి. కాంతివంతమైన  బల్బు లేకపోతే కొవ్వొత్తుల ఆయుష్షు కక్షీణించి మరనిస్తాయని  తెలుసు కానీ బల్బుని కాపాడుకునే ధైర్యం చేయలేక చేవచచ్చి పిరికి తనంతో చూస్తూ ఉన్నాయి. ఎదురు తిరిగితే బల్బుని కాపాడుకొని కొవ్వొత్తులు బ్రతకవచ్చు.
              మిత్రులారా తెలివైన వారికీ, ధైర్యంగా ముందడుగు వేశి సమాజాన్ని దేశాన్ని ప్రగతి బాటలో నడిపించే నాయకునికి అండగా వుండి కాపాడుకుందాం పురోగతి సాధిద్దాం. లేదంటే మనం కొవ్వొత్తులవలె కాలి కరిగి పోయి మనుగడని కోల్పోక తప్పదు.
      ఈ చిత్రపటం ఏ చిత్రకారుడు గీసారో కానీ వారికి నా వందనాలు.

Courtesy: Vinod Kumar Varma

Thursday 15 December 2016

Saitre on Demonitization

FORTHCOMING MOVIES IN 2017

Cash Me If You Can

Ye  Withdrawal hai Mushkil

The Silence Of  Banks

Hum Demonetise Ho Chuke Sanam

500/1000 shades of grey

Account Apna Aur Note Paraye

Mission Cash-Mir

Fifty shades of black

Blackmoney Bhaijaan

Cheque De India

Kabhi Card, Kabhi Cash

Currency Na Milegi Dobara

Tuesday 13 December 2016

Short Telugu Morale story...

అనగనగా ఓ ఊరిలో గొప్ప ధనవంతుడున్నాడు. అతనికి ఎన్నేళ్ళైనా సంతానం కలగలేదు . అనారోగ్యంతో భార్య కూడా చనిపోయింది . తన తరుపు బంధువులు , భార్య తరుపు బంధువులు ఆస్తి కోసం ఇతనెప్పుడు పోతాడా ....అని రాబందుల్లా ఎదురు చూడసాగారు .ఇదంతా చూసిన ధనికునికి విరక్తి కలిగి ఓ గుడిని కట్టించి , ఓ పూజారిని నిత్యమూ పూజ చేసేందుకు నియమించాడు .ఆగుడికి ఎవ్వరు వచ్చినా ఉండటానికి సత్రమూ , భోజన శాలా కట్టించి పేదవారికి నిత్యాన్నదానం జరిగేలా ఏర్పాట్లు చేశాడు .ఖర్చుల నిమిత్తం తనకున్న పొలాలూ ,తోటలూ గుడికి మాన్యంగా రాసిచ్చాడు .

అతనికి వృద్ధాప్యం వచ్చింది . దేవాలయం ఆస్తుల్ని భద్రంగా కాపాడుతూ గుడి వ్యవహారాలన్నీ చూసుకొనే వారెవరికైనా బాధ్యత అప్పగించుదామని చూడసాగాడు . విషయం తెలిసి భూములపై వచ్చే ఆదాయానికి ఆశపడి ,కనీసం మంచిజీతమైనా దొరక్కపోతుందా అని ధనికుని వద్దకు ఎంతోమంది వచ్చేవారు .కానీ ఆ ధనికుడు అందర్నీ తిప్పి పంపేసేవాడు . నాకు మంచి మనిషి కావాలి అతనికే ఈ బాధ్యత అప్పగిస్తాను అని అందరితో అనేవాడు .చాలా మంది అతన్ని మూర్ఖుడనీ , పిచ్చివాదనీ అన్నా ఎవరినీ లెక్కచేసేవాడు కాదు .

రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకూ గుడికి వచ్చి పోయే వారిని గమనిస్తూ ఉండేవాడు .ఓ రోజు ఒక వ్యక్తి దర్శనానికి వచ్చాడు . చిరిగిన బట్టల్లో , పెద్దగా చదువు కున్నట్టు కూడా కనపడని అతడ్ని ధనవంతుడు తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు ." అయ్యా !మీరు ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతని స్వీకరించ గలరా ? "అని అడిగాడు . అతడు ఆశ్చర్యం గా "నేను ఎక్కువ చదువుకోలేదు ఇంత పెద్ద గుడి బాధ్యత నేనెలా నిర్వహినచగలను ?" అన్నాడు .

నాకు పండితుడక్కర్లేదు మంచి మనిషైతే చాలు ఈ బాధ్యత అప్పగించి విశ్రాంతి తీసుకోదలిచాను అన్నాడు .
అప్పుడా మనిషి "నేను మీకు పరిచయం లేదు .ఇంతమందిలో నన్నే మంచివాడిగా ఎందుకు భావించారు " అడిగాడు .
" మీరు మంచివారని నాకు తెలుసు గుడికి వచ్చే దారిలో ఓ రాయి పాతుకుపోయి ఉంది చాలా రోజులుగా దాని మొన బయటికి వచ్చి అందరి కాళ్ళకీ తగులుతూ ఉంది . తగిలిన వారు ముందుకు తూలటమో , లేక పడిపోతే లేచి దుమ్ము దులుపుకు పోవడమో చేస్తున్నారు .నేను చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాను ఎవ్వరూ పట్టించుకోలేదు . కానీ మీ కాలికి ఆ రాయి తగల్లేదు .అయినా మీరు కష్టపడి ఆరాయిని తవ్వితీసివేసి ,అక్కడ నేలంతా చదును చేశారు .అన్నాడా ధనవంతుడు .
అప్పుడా వ్యక్తి " ఇదేమీ పెద్ద పని కాదు మనకు గానీ ఎదుటివారికి గానీ హాని కలిగించే రాళ్ళు , ముళ్ళు లాంటివి తొలగించడం ప్రతీ మనిషి కర్తవ్యం " అన్నాడు .
తన కర్తవ్యాన్ని తెలుసుకొని నడుచుకొనే వాడే మంచిమనిషి .అంటూ ఆ ధనికుడు దేవాలయ బాధ్యతలన్నీ ఆ వ్యక్తికి అప్పగించాడు .

నీతి : మంచివారికి మంచే జరుగుతుంది .

కొసమెరుపు : అమ్మమ్మ గారు చెప్పిన ఈ కధ చిన్నప్పట్నించీ మనసులో ముద్రించుకుపోయి ఇప్పటికీ బయటికెల్లినపుడు రోడ్డు మీద అరటి తొక్కలున్నా , కాళ్ళకి తగిలేలా రాళ్ళున్నా వంగి ఏరేస్తూ  ఉంటాను :) :)

Thursday 1 September 2016

Jai Jawan!

ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!

ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.

ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.

కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....

ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....

ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది...........